హైదరాబాద్ లో నకిలీ ధ్రువపత్రాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిందితుల్లో బీఈడీ కళాశాల ప్రిన్సిపల్, ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ముఠా సభ్యుల నుంచి 430 నకిలీ సర్టిఫికేట్స్, 170 రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్‌తో పాటు ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐకి సంబంధించిన నకిలీ సర్టిఫికెట్స్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa