హైదరాబాద్‌లోని మియాపూర్‌లో మెట్రో స్టేషన్‌కు సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద ఈ రోజు పేలుడు సంభవించడం కలకలం రేపింది. మియాపూర్ మెట్రో డిపో సమీపంలో భారీ శబ్దంతో పేలిన బాంబ్ ఆ విస్ఫోటనానికి అదే సమయంలో అక్కడ గడ్డి మేస్తున్న గేదె తల తెగిపడింది..జానా వాసులకు అత్యంత సమీపంలో ఈ ఘటన జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.మియాపూర్ హరిశ్చంద్రారెడ్డి సంఘటన జరిగిన ప్రాంతంలో పేలుడు దేనివల్ల సంభవిచిదనే కారణాలను పరిశీలిస్తున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అక్కడ ఓ నాటు బాంబు పేలిందని నిర్ధారించారు. నాటు బాంబు పేలుడు ధాటికి స్థానికులు భయపడిపోయారు.క్లూస్ టీం, బాంబ్ స్క్వాడ్ లతో డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఓ వైపు పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తుండగానే మరోవైపు ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడును దృష్టిలో పెట్టుకుని నగరంలోని హోటళ‍్లు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన‍్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa