ఉత్తరాదిని భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. అస్సోం, బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా వరదల కారణంగా 112 మంది మరణించినట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.అస్సోంలో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శర్బానంద సోనోవాల్ పర్యటించారు.బీహార్ లోనూ భారీ వర్షాలకు నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కోసీ నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో వేలాది ఇళ్లు నీట మునిగాయి. వరద పరిస్థితిపై సీఎం నితీష్ ఏరియల్ సర్వే జరిపి. సమీక్ష నిర్వహించారు. 10కి పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, మరికొన్ని బృందాలు ఇవాళ వరద ప్రాంతాలకు చేరుకోనున్నట్లు చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పొట్లాలు విడిచేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కేంద్రాన్ని అడిగామని నితీష్ వెల్లడించారు.బెంగాల్ లోని సిలిగురి ప్రాంతంలో 20 ఏళ్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఉత్తర బెంగాల్ ప్రాంతంలో మూడు లక్షల మంది వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు.రాష్ట్రాల్లో వరద ప్రభావంపై సీఎంలతో ప్రధాని మోడీ మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను వెంటనే ఆయా రాష్ట్రాలకు పంపిస్తున్నామని, కేంద్రం నుంచి అన్ని విధాల సాయం ఉంటుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa