హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లాలో భారీ ప్రదర్శన చేపట్టారు. నగరంలోని స్కూల్, కాలేజీ విద్యార్థులు భారీ సంఖ్యలో జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. సుమారు 20 వేల జాతీయ జెండాలు ర్యాలీలో రెపరెపలాడాయి. ప్రజల మధ్య జాతీయ సమగ్రతను పెంపొందించేందుకు పెద్దపల్లి పోలీసులు ఈ మెగా ర్యాలీని ఏర్పాటు చేశారు. మేరా భారత్ మహాన్ అన్న నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రామగుండం పోలీసులు ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. గతంలో 3.2 కిలోమీటర్ల పొడుగున్న జాతీయ జెండాను ప్రదర్శించి రికార్డు క్రియేట్ చేసిన రామగుండం పోలీసులు ఇప్పుడు 20వేల జెండాలతో మరో రికార్డును నమోదు చేశారు. దీంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. పెద్దపల్లి టౌన్‌లోని జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఉదయం ర్యాలీ ప్రారంభమైంది. ప్రశాంతినగర్, అమర్‌నగర్, మజిద్ చౌక్, జెండా కమాన్ మీద మళ్లీ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. మంచిర్యాల, పెద్దపల్లికి చెందిన పోలీసులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ విక్రమ్ జీత్ దుగ్గల్ ఈ ర్యాలీని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, పంచాయత్ చైర్మన్ రాజయ్య, డీసీపీ విజయేందర్ రెడ్డి, ఏసీపీ సింధు శర్మ, సీఐ మహేశ్, ఎస్ఐ జగదీశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa