ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌ అభిమానులను నియంత్రించలేను సాయిధరమ్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 02:05 PM

మెగా అభిమానులందు పవన్‌ అభిమానులు వేరయా అనేది ఎప్పుడో స్పష్టం అయిపోయింది. పవన్‌ లేకుండా ఇతర మెగా హీరోలెవరైనా ఫంక్షన్‌ చేసుకోవాలనుకుంటే కాస్త కష్టమవుతోంది. ఆఖరికి చిరంజీవి మాట్లాడుతున్నా ‘పవర్‌స్టార్‌.. పవర్‌స్టార్‌’ అనే అరుపులు కామన్‌ అయిపోతున్నాయి. దీంతో అల్లు అర్జున్‌ ఓ ఫంక్షన్‌లో పవన్‌ ఫ్యాన్స్‌కు క్లాస్‌ తీసుకున్నాడు. ‘చెప్పను బ్రదర్‌’ అంటూ పవన్‌ ఫ్యాన్స్‌కు శత్రువు అయిపోయాడు.

మరోవైపు సాయిధరమ్‌ మాత్రం ‘ఆపలేను బ్రదర్‌’ అంటూ పవన్‌ ఫ్యాన్స్‌ను ఆకర్శించాడు. ఫంక్షన్లలో తన మామయ్య పేరుతో అరుస్తున్నవారిని కంట్రోల్‌ చేయనని చెప్పాడు. ‘నాగబాబు, బన్నీ.. అలా అరుస్తున్నందుకు ఫ్యాన్స్‌కు క్లాస్‌ తీసుకున్నారుగా’ అనే ప్రశ్న ఇటీవల సాయిధరమ్‌కు ఎదురైంది. దానికి సాయిధరమ్‌ స్పందిస్తూ.. ‘ఎవరి అభిప్రాయం వారిది. వాళ్ల సిట్యువేషన్‌లోకి వెళ్లి నేను కామెంట్‌ చేయలేను. వారు అలా అంటే అనుండొచ్చు. నేను మాత్రం అలా అనలేను. నాకు మా ముగ్గురు మావయ్యలంటే ఎంతో ఇష్టం. నేను, మా అమ్మ, తమ్ముడు ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి వారు ముగ్గురే కారణమ’ని చెప్పాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa