ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తల అరెస్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 02:04 PM

న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆందోళన నేపథ్యంలో పోలీసులు ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రశాంత్ మిశ్రా, వినాయక్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడులు చేసినవారిపై చర్యలు పట్టుపడుతూ డీయూలో ఏఐఎస్ఐ తదితర విద్యార్థి సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఏఐఎస్ఐకి చెందిన ఇద్దరు విద్యార్థుల పిర్యాదు నేపథ్యంలో ఈ ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై ప్రశాంత్ మిశ్రా, వినాయక్ శర్మలు విడుదల అయ్యారు. అయితే ఏబీవీపీ ఈ ఇద్దరినీ సస్పెండ్ చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa