హైదరాబాద్ : పవిత్ర స్వాతంత్య్ర దినోత్సవం రోజున నిరుద్యోగ యువతకు శుభవార్త అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం ప్రసంగిస్తూ తెలంగాణ ఆవిర్భవిస్తే లక్ష ఉద్యోగాలు సిద్ధిస్తాయని ఉద్యమంలో చెప్పా. ప్రభుత్వం లక్షా 12 వేల 536 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇప్పటివరకు 27,660 ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపట్టాం. త్వరలో మరో 84,877 ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతాం. వచ్చే ఏడాది ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ఏడాదే నియామకం చేపట్టాలని ఆదేశాలు జారీచేసినట్లు సీఎం వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa