హైదరాబాద్‌లో ఓ వితంతవుపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త మరణించడంతో కూలి పనులు చేసుకుంటూ గండిమైసమ్మ కూడలిలో మహిళ నివాసం ఉంటోంది. పని కోసం వెళ్లేందుకు గత ఆదివారం షాపూర్‌నగర్ అడ్డాలో వేచి ఉండగా.. నలుగురు యువకులు ఆటోలో వచ్చి తనని బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు జీడిమెట్ల పోలీసులకి తాజాగా బాధితురాలు ఫిర్యాదు చేసింది.
అత్యాచార విషయం ఎవరికైనా చెప్తే.. చంపేస్తామని నిందితులు తనని బెదిరించారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. నిందితుల్లో రోడామిస్త్రీనగర్‌కి చెందిన అడ్డూ, ఇషాక్ సదరు మహిళకి పరిచయస్తులని తేలింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జడీమెట్ల పోలీసులు నలుగురి నిందితుల్ని అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే.. భర్త మరణించిన తర్వాత సదరు మహిళ మరొకరితో సహజీవనం చేస్తున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa