ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుత్బుల్లాపూర్ మండలంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 09:43 AM

హైదరాబాద్ : డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో భాగంగా మరో 1,620 ఇండ్లకు ఈ రోజు గ్రేటర్ పరిధిలోని కుత్బుల్లాపూర్ మండలం డీ పోచంపల్లిలో పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు. గ్రేటర్‌లో పేదలకోసం ఈ ఏడాది లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు 58 వేల ఇండ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, 28 వేల ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. 37 కాలనీల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి. తాజాగా డీ పోచంపల్లిలో మరో 1,620 ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు. మొత్తం ఏడు ఎకరాల విస్తీర్ణంలో 11 బ్లాకుల్లో తొమ్మిది అంతస్తుల భవనాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు.


ఉదయం 10:30 గంటలకు ఔటర్ రింగురోడ్డు పరిధిలోని పలు గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.627 కోట్లతో నిర్మించనున్న తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఫైలాన్‌ను కొంపల్లిలోని సెంట్రల్ పార్కులో ప్రారంభిస్తారన్నారు. అదేవిధంగా గండిమైసమ్మలో నిర్మిస్తున్న 1600 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు షాపూర్ నగర్‌లో నిర్మించిన తాగునీటి రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa