రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ – తాళ్లగూడ మధ్య శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. దండు మైలారం, ముక్కునూర్ నుంచి స్కూల్ విద్యార్థులను ఎక్కించుకుని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 20 మంది చిన్నారులున్నారు. ఇందులో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. సెల్ ఫోన్ల మాట్లాడుతూ… అతివేగంగ బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa