హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా సాగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులకు గవర్నర్ నరసింహన్ తేనీటి విందు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ ఇందులో పాల్గొన్నారు. మంత్రులు నాయిని, కేటీఆర్, చందూలాల్, తలసాని, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ, అధికార, క్రీడా రంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ దంపతులు అతిథులకు సాదర స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa