ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాల‌పై క‌డియం స‌మీక్ష‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 05:02 PM

హైద‌రాబాద్: ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కాల‌పై డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి క‌డియం శ్రీహ‌రి ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి చీఫ్ సెక్ర‌ట‌రీ ఎస్పీ సింగ్, జీఏడీ ముఖ్య కార్య‌ద‌ర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, టీఎస్పీఎస్సీ చైర్మ‌న్, విద్యా శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శి హాజ‌రయ్యారు. పంద్రాగ‌స్టు వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు అందించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఆశించ‌న దాని కంటే మిన్న‌గా 1,12,536 ఉద్యోగాల భ‌ర్తీ కి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన 27,660 నియామ‌కాల‌కు తోడుగా మ‌రో 84,876 ఉద్యోగాల నియామ‌క ప్ర‌క్రియ‌ను స‌త్వ‌ర‌మే చేప‌ట్ట‌బోతున్న‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. ఈ నియామ‌క ప్ర‌క్రియ పై అధికారులంద‌రితో మంత్రి క‌డియం చ‌ర్చించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa