న్యూఢిల్లీ: బ్లూ వేల్ గేమ్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. బ్లూవేల్ గేమ్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నట్లు ఇవాళ కేంద్ర న్యాయ, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బ్లూవేల్ గేమ్‌ను నియంత్రించాలని టెకీ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఎటువంటి చర్యలను ఐటీశాఖ ప్రోత్సహించదు అని ఆయన అన్నారు. కేంద్ర ఐటీశాఖ ఇచ్చిన ఆదేశాలకు అన్ని ఐటీ సంస్థలు కట్టుబడి ఉండాలని ఆయన అభ్యర్థించారు. ఎటువంటి ఉల్లంఘనలు జరిగినా ఆయా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. బ్లూవేల్ వ్యాప్తిని అదుపులో పెట్టాలని అన్ని టెక్ సంస్థలకు ఆదేశించారు. భారత్‌లో ఇటీవల బ్లూవేల్ గేమ్ వల్ల చిన్నారులు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa