ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం సోనోవాల్ పర్యటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 16, 2017, 05:50 PM

అసోం: అసోంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్ పర్యటించారు. తీవ్ర ముంపుతో అతలాకుతలమవుతున్న సౌత్ సల్మారా-మంకచర్ జిల్లాలోని సిసు మరా, జింజిరామ్ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం వరద పరిస్థితులను, రెస్యూ టీం కొనసాగిస్తున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. వరద ప్రభావ ప్రాంతాల ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలను సీఎం సోనోవాల్ అధికారులకు వివరించారు. సీఎం వెంట ఉన్నతాధికారులు, ఆర్మీ, రెస్యూ టీం అధికారులు ఉన్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa