లక్నో:అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి గాయత్రి ప్రజాపతి మంగళవారం నుంది అదృశ్యమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం నాడే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. త్వరలోనే ఆయనను అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కన్పించకుండా పోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో గాయత్రి ప్రజాప్రతి మంత్రిగా ఉన్నారు. తనతో పాటు తన మైనర్ కూతురుపై గాయత్రి ప్రజాపతి ఆయన అనుచరులు అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసేందుకుగాను ముందుకు రాలేదు. అయితే బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై నివేదిక అందించాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు ఆఘామేఘాల మీద చర్యలకు ఉపక్రమించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంత్రి గాయత్రి ప్రజా పతి ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించారు.అయితే అప్పటి నుండి మంత్రి అదృశ్యమయ్యారు. అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో గాయత్రి ప్రజాపతి అదృశ్యం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa