జర్నలిస్టుల సంక్షేమంలో సీఎం కేసీఆర్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నారని మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి అన్నారు. వంద కోట్ల రూపాయలతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని తెలిపారు. సమాజం కోసం అహర్నిశలు పాటు పడుతున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందన్నారు.
జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణ అకాడమీ ఆఫ్ మీడియా ఛైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.హైదరాబాద్ ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీయూడబ్ల్యూజే నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులతో పాటు హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, వరంగల్ మేయర్ నరేందర్, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జర్నలిస్ట్ నేతలు పాల్గొన్నారు.