వరంగల్ : హన్మకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రూ. 7 కోట్లతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. రాష్ర్టంలో ఇంటర్ విద్యను బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూడేళ్లలో ఇంటర్ విద్యకు రూ. 325 కోట్లు వెచ్చించామని చెప్పారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను త్వరలోనే క్రమబద్దీకరిస్తామని స్పష్టం చేశారు కడియం.