ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెమీస్‌లో ఓడిన శ్రీవల్లి రష్మిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 12:24 PM

హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘం (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ అండర్‌-18 గ్రేడ్‌-3 సౌత్‌ సెంట్రల్‌ సర్క్యూట్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలుగు అమ్మాయి శ్రీవల్లి రష్మిక పోరాటం సెమీస్‌లో ముగిసింది. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌కు షాకిచ్చి ఆకట్టుకున్న రష్మిక సెమీస్‌లో 3-6, 3-6తో ఐదో సీడ్‌ విక్టోరియా అలెన్‌ చేతిలో పరాజయం పాలైంది.


జింబాబ్వేలో జరుగుతోన్న ఈ టోర్నీ క్వార్టర్స్‌లో రష్మిక 7-5, 6-1తో అనా గ్రాస్‌పై, ప్రిక్వార్టర్స్‌లో 6-4, 6-4తో టాప్‌ సీడ్‌ హాల ఖాలేద్‌ (ఈజిప్ట్‌)ను కంగుతినిపించింది. అంతకుముందు జరిగిన తొలి రౌండ్‌లో 6-1, 6-1తో కవోమి (జింబాబ్వే)ను చిత్తుగా ఓడించింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com