సూర్యాపేట: రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా... జిల్లాలోని చివ్వెంల మండలం దురాజ్ పల్లి గ్రామంలో పెదద్ గట్టు ఆర్చి కి ఎదురుగా జాతీయ రహదారి 65 పక్కన ఎకరం స్థలంలో విప్రహిత బ్రాహ్మణ సదనం భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ కేవీ రమణాచారి, కలెక్టర్ సురేంద్ర మోహన్, ఎంఎల్సీ సతీశ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa