ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌పై ఎమ్మెల్యే రసమయి ఫైర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 05:40 PM

కరీంనగర్‌: జిల్లాకేంద్రంలో నిర్వహించిన డిజీధన్ మేళా వివాదానికి నెలవైంది. ప్రోటోకాల్‌ విషయంలో మొదలైన వివాదం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కి కలెక్టర్ సర్పరాజ్ వేలు చూపించడంతో ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం అంబేద్కర్ స్టేడియంలో డిజీధన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మంత్రి ఈటల రాజేందర్, నీతిఆయోగ్ డైరెక్టర్ నీరజ్ శ్రీవాస్తవ, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమాలకర్, తదితరులు హాజరయ్యారు. అయితే వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో తమ ఫోటోలు పెట్టలేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యేలు వేదికపైకి ఎక్కకుండా నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.దీంతో నా గురించి మాట్లాడొద్దు అంటూ కలెక్టర్ సర్పరాజ్, రసమయికి వేలు చూపించారు. వేలు చూపించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రసమయి.. నాకే వేలు చూపిస్తావా అంటూ కలెక్టర్‌పై నిప్పులుచెరిగారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa