నిరుపేద కుటుంబాల నుంచి పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజలందరూ మెచ్చే విధంగా పని చేస్తామని మీరు చెప్పినందుకు ఇంకా సంతోషంగా ఉందన్నారు. పాతబస్తీలోని ధూల్ పేట, మంగళ్ హాట్ నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారిని సీతారాంబాగ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన అభినందించారు. తన కెరీర్ లోనే ఇలాంటి పెద్ద విజయాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. మంగళ్ హాట్ ఏరియాలో భవిష్యత్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవని విశ్వాసం వ్యక్తం చేశారు. ధూల్ పేటలో శాంతి నెలకొల్పాలనే ఈ సంకల్పం తీసుకున్నామని చెప్పారు. ధూల్ పేట, మంగళ్ హాట్ యువతకు శిక్షణ ఇచ్చేందుకు సహకరించిన దాతలకు సీపీ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa