ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరీంనగర్‌ కలెక్టర్‌పై ఎమ్మెల్యే రసమయి ఫైర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:32 AM

కరీంనగర్‌-సూర్యప్రత్యేకప్రతినిధి: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో బుధవారం నిర్వహించిన డిజిధన్‌ మేళా వివాదానికి నెలవైంది.
     ఫ్రోటోకాల్‌ విషయం లో జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కు మధ్య వివాదంగా నెలకొంది. డిజి ధన్‌ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర  కార్మిక శాఖ మంత్రి బండారు దత్తా త్రేయతో పాటు మంత్రి ఈటల రాజేందర్‌, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌లు పాల్గొన్నారు. వేదిక మీదకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, గంగుల కమలా కర్‌లను ఆహ్వ నించకపోవడంతో  వేదిక కిందే భీష్మించుకుని కూర్చున్నారు. ఫ్రోటోకాల్‌  ప్రకా రం మమ్మల్ని ఎందుకు వేదికపైకి పిలువలేదని కలెక్టర్‌ను నిలదీశారు. దీంతో కలెక్టర్‌ రసమయి వైపు వేలు చూపడంతో ఉద్రిక్తతను దారి తీసింది. పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యేలను వారించడంతో గొడవ సద్దుమణిగింది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa