ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్‌ నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము గోవా సదస్సులో డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:28 AM

  మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధి : గోవాలో జరుగుతున్న స్మార్‌‌ట సిటీ సమ్మిట్‌లో తెలంగాణ ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరితో పాటు గ్రేటర్‌ వరంగల్‌ కార్పోరేషన్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ పాల్గొంటున్నారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, ప్రధాన మంత్రి నరేంద్రమోఢీల సహకారంతో ఓరుగల్లు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్‌ను స్మార్‌‌ట నగరంగా ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఙతలు తెలిపారు. కేంద్రం నుండి విడుదలయ్యే నిధులతో సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో వరంగల్‌ను అభివృద్ది చేస్తామన్నారు. ఇప్పటికే సిఎం వరంగల్‌ను ఎడ్యుకేషనల్‌ హబ్‌గా తీర్చిది ద్దుతున్నారని కొనియాడారు. ఐఐఎం, గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, సైనిక్‌ స్కూల్‌, హెల్‌‌త యూనివర్శిటి వంటి  విద్యాలయాలు కూడ వరంగల్‌కు వచ్చాయని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కెజి టు పిజి ఉచిత విద్య, ఆసరా వంటి పథకాలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయన్నారు. కాకతీయులు నిర్మించిన కట్టడాలు ఓరుగల్లుకు వన్నె తెస్తున్నాయని హృదయ్‌ పథకం కింద వీటి అభివృద్దికి కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. పర్యాటక రంగంలో వరంగల్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కడియం శ్రీహరి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa