-ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తున్న ఎమ్మెల్యేలు
-పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్న నేతలు
-నామినేటెడ్ పదవులలో సీనియర్లకు పెద్దపీట
-సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లడమే లక్ష్యం
-నర్సంపేట, గీసుకోండ మధ్య ఏర్పాటు కానున్న టెక్‌సటైల్ పార్కు
-పెద్ది సుదర్శన్‌రెడ్డితో సఖ్యతగా ఉంటున్న ఆరూరి, చల్లా
మేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధిః ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో అధికార పార్టీ నేతలు ఐక్యంగా ముందుకు కదులుతున్నారు. నామినేటెడ్ పదవుల పంపిణీలో సీనియర్లకు పెద్దపీట వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారిని కాపాడుకుంటున్నారు. ఓ వైపు పార్టీ పదవులను భర్తీ చేస్తూనే మరోవైపు పార్టీ నేతలను ఐక్యం చేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో పరకాలలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాదించిన చల్లా ధర్మారెడ్డి తదనంతర పరిస్థితులలో టిఆర్‌ఎస్‌లో చేరారు. పాత టిఆర్‌ఎస్‌తో పాటు కొత్తగా వచ్చిన టిడిపి క్యాడర్‌కు కూడ సరైన ప్రాతినిధ్యం వచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫలితంగా వరంగల్ రూరల్ జిల్లాపై అధికార టిఆర్ ఎస్ పార్టీ పట్టు బిగిస్తోంది. జిల్లా కేంద్రం లేకుండా ఏర్పాటయిన జిల్లాగా రూరల్ పేరు గాంచింది. నర్సంపేట, వర్దన్నపేట, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్, రూరల్‌జిల్లాల ఏర్పాటుపై తొలుత అనేక సందేహలు ఏర్పాడ్డాయి. రూరల్ జిల్లాలోని ఎక్కువ ప్రాంతం వరంగల్ నగరం చుట్టు కేంద్రీకృతం కావడంతో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ ఈ ప్రాంతాన్ని అర్బన్ జిల్లాలోనే కొనసాగించాలని పట్టుబట్టారు. అయినప్పటికి సిఎం కెసిఆర్ పట్టుబట్టి మరి జనాభా ప్రాతిపాదికన రెండవ జిల్లా అవసరం అని భావించి ఈ జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లా పరిదిలో నలుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయపర్తి మండలం ఈ జిల్లాలోనే కలిసింది. వర్దన్నపేటలోని నాలుగు మండలాలు, పరకాలలోని ఐదు మండలాలు, నర్పంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు వెరసి రూరల్ జిల్లాగా ఏర్పడింది. రాజకీయంగా ఈ ప్రాంతంలో పట్టు పెంచుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వర్దన్నపేట నియోజకవర్గం ఎస్‌సిలకు రిజర్వు కాగా పరకాల, నర్సంపేట, పాలకుర్తిలు జనరల్‌గా ఉన్నాయి.
గత సార్వత్రిక ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ కేవలం వర్దన్నపేట నియోజకవర్గంలో విజయం సాదించగా పరకాలలో టిడిపి, నర్సంపేటలో ఇండిపెండెంట్ అభ్యర్థి దొంతి మాదవరెడ్డి విజయం సాదించారు. మారిన రాజకీయా పరిస్థితులలో బాగంగా పరకాల ఎమ్మెల్యే చల్లా దర్మారెడ్డి అధికార టిఆర్‌ఎస్‌లోకి మారారు. నర్సంపేట ఎమ్మెల్యే మాదవరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. వర్దన్నపేటలో గత ఎన్నికలలో టిఆర్ ఎస్‌కు భారీ మెజారిటీ వచ్చింది. అయితే ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలలో నియోజకవర్గంలోని పది డివిజన్లలో టిఆర్‌ఎస్ కేవలం నాలుగు స్థానాలలో మాత్రమే గెలుపొందగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులు మరో మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌పై ఉన్న వ్యతిరేకతే టిఆర్‌ఎస్ ఓటమికి కారణమనే విశ్లేషణలు మొదలయ్యాయి.
టిఆర్‌ఎస్ బాధ్యతలను పంచుకుంటున్న శాసనసభ్యులు
అధికార టిఆర్‌ఎస్ పార్టీ బాధ్యతలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో పాటు రాష్ట్ర పౌర సరఫరాల కార్పోరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డిలు పంచుకుంటున్నారు. నర్సంపేట నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసి ఓటమి పాలైన తరువాత కొద్ది రోజుల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్న పెద్ది తదనంతరం తన వ్యూహన్ని మార్చుకున్నారు. సిఎం కెసిఆర్ ఆశీస్సులతో నామినేటెడ్ పదవి పొందిన అనంతరం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రూరల్ జిల్లాలో టిఆర్‌ఎస్ బలం పెంచేందుకు వ్యూహలు రచిస్తున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి రాకుండా అడ్డుకోవడంలో సుదర్శన్‌రెడ్డి విజయం సాదించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అదేవిదంగా రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని సొంతం చేసుకున్న ఆయన పాలన వ్యవహరాలలోను తనదైన ముద్ర వేస్తున్నారు. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తనదైన శైలిలో పనిచేసుకుపోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారిని తనను నమ్ముకుని టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిని కలుపుకుని పోతున్నారు. వర్దన్నపేటలో ఆరూరి రమేశ్‌కు కాస్తా వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికి వాటన్నింటిని తట్టుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఆరురి అనుచరులు ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం మొదటి నుండి ఎరబ్రెల్లి కంచుకోటలా ఉంది. గత ఎన్నికలలో ఆయనకు ఈ ఒక్క మండలం నుండే ఐదువేలకు పైగా మెజారిటీ రావడం గమనర్హం. ఈ జిల్లా పరిదిలోకి భారీ టెక్సుటైల్ పార్కు రాబోతుంది. దీని వల్ల వేలాదిమంది యువకులుకు ఉపాధి దొరుకుతుందని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. పారిశ్రామికంగా ఈ ప్రాంతం దిన దినాభివృద్ది చెందుతుండటం టిఆర్‌ఎస్ నేతలకు కలసి వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa