ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలియా భట్ సంచలన ప్రకటన నాకబోయే భర్తకు నా తండ్రి గుణాలొద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 01:06 PM

‘మా తండ్రి గుణగణాలు నా భర్తలో చూసేందుకు ఇష్టపడను’ అనేదే ఆ ప్రకటన సారాంశం. అయితే ఆలియా ప్రకటనకు బలమైన కారణాలు లేకపోలేదు. తన మాజీ భార్య కిరణ్‌కు పుట్టిన కూతురు పూజా భట్‌ను మహేష్‌ భట్‌ లిప్‌ లాక్‌లో ముంచెత్తి అభిమానుల నుంచి విమర్శల పాలయ్యాడు. అంతేకాదు పూజా తన సొంత కూతురు కాకుంటే ఆమెను పెళ్లాడే వాడినని ప్రకటించి బాలీవుడ్‌ని ఆశ్చర్యపరచాడు. కిరణ్‌కు పుట్టిన కొడుకు రాహుల్‌ భట్‌కు కూడా తండ్రి మహేష్‌ అంటే అసహ్యం. మహేష్‌ భట్‌ కొడుకుగా పుట్టడం తన దౌర్భాగ్యం అంటాడు బహిరంగంగానే. ఆమీర్‌ ఖాన్‌ నిర్మించి ఆస్కార్‌ బహుమతికి పోటీపడిన లగాన్‌ సినిమాను వ్యతిరేకించిన ఒకే ఒక వ్యక్తి మహేష్‌ భట్‌. కరణ్‌ జోహార్‌ సమర్పించే కాఫీ విత్‌ కరణ్‌ కార్యక్రమంలో పాల్గొని, దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీని ఓవర్‌ రేటెడ్‌ దర్శకునిగా, నటి కాజోల్‌ని ఓవర్‌ రేటెడ్‌ యాక్ట్రెస్‌గా వర్గీకరించి విమర్శల పాలయ్యాడు. బహుశా ఈ కారణాల వలననే ఆలియా భట్‌ అలా ప్రకటన చేసిందేమో అనుకోవాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com