ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల విభజన త్వరితగతిన పూర్తిఅయ్యేట్లు చర్యలు:దత్తాత్రేయ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 06:50 PM

ఢిల్లీ: పాత పెంక్షన్ విధానం అమలు కోరుతూ జంతర్ మంతర్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా చేసారని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఉద్యోగుల ఎదుర్కుంటున్న సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పెంక్షన్ బెనిఫిట్స్ ని ఒకేసారి ఇచ్చేందుకు కృషి చేయాలనీ ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేసారని తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రధాని,ఆర్థికమంత్రితో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 2004 నుంచి నూతన పెంక్షన్ విధానం అమలులోకి వచ్చిందని ఆయన వివరించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సామజిక భద్రత కు నూతన పథకాలు తీసుకొస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa