జాతీయ గిరిజన ఉత్సవాలకు హైదరాబాద్ వేదిక అవుతోంది. రేపటి నుంచి భాగ్యనగరంలో ‘ఆదిరంగ్’ పేరిట జాతీయ గిరిజన ఉత్సవాలు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు లలిత తోరణంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో 400 మందికి పైగా గిరిజన కళారూపాలు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఆదిరంగ్ కు సంబంధించిన బ్రోచర్ ను ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు విడుదల చేశారు. హైదరాబాద్ ను సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రమణాచారి తెలిపారు. కళాప్రదర్శనలతో పాటు గిరిజన ఉత్పత్తులు విక్రయించే స్టాల్స్ ఉంటాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa