టోక్యో:ఇవాళ జరిగిన ప్రీక్వార్టర్స్‌లో సింధుపై 21-18, 21-8 తేడాతో ఒకుహర సునాయాసంగా గెలిచింది. సొంతగడ్డపై ఫేవరెట్‌గా దిగిన ఒకుహర.. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడి సింధు పైచేయి సాధించకుండా జాగ్రత్త పడింది. ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్, కొరియా ఓపెన్ ఫైనల్‌కు భిన్నంగా ఈ మ్యాచ్ సాగింది. ఆ రెండు మ్యాచుల్లో ఈ ఇద్దరూ మూడు గేమ్స్ వరకు హోరాహోరీగా తలపడగా.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఒకుహర చెలరేగింది. దీంతో మరో సూపర్ సిరీస్ గెలవాలన్న సింధు ఆశలు నెరవేరలేదు. కేవలం 47 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. కనీసం క్వార్టర్స్ కూడా చేరకుండానే సింధు ఇంటిదారి పట్టింది.