ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విహారయా్తల్రో విషాదƒం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 12:27 AM

 పీసీ పల్లి సమీపంలో ఘోర బస్సు ప్రమాదం


 పాలేరు నదిలో బోల్తా కొట్టిన విద్యార్థుల బస్సు 


 40 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు, 23 మందిని రిమ్‌‌సకు తరలింపు


 సంఘటనా స్థలాన్ని పరిశీలించి, విద్యార్థులను పరామర్శించిన మంత్రి శిద్ధా  


 ప్రమాద సంఘటనపై విచారణకు సీఎం ఆదేశం


 క్షతగాు్తల్రను పరామర్శించిన జిల్లా కలెక్టర్‌, జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు


 డ్రైవర్‌  మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణం 


 గురువారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో... ఇంకా వేకువ చీకట్లు తొలగిపోలేదు... విహార యాత్ర ముగించుకొని... చూసిన ప్రదేశాలు నెమరు వేసుకుంటూ... తమ సంతోషాలను చెప్పుకుంటూ... నిద్రలోకి జారుకున్నారు ఆ విద్యార్ధులు. తెల్లవారితే స్వగ్రామాలకు చేరుకుంటామన్న ధీమాతో...గాఢ నిద్రలో ఉన్నారు ఆ విద్యార్ధులంతా... ఇంతలో ఏదో కలలో సంఘటనలా తామంతా గాల్లోకి ఎగురుతున్నట్లు భావన. భారీ కుదుపు.. పెద్ద శబ్దం... ఒళ్లంతా గాయాలు... అద్దాలు గుచ్చుకొని... తల, శరీర భాగాలపై రక్తపు దారలు... చుట్టూ చీకటి.. బయట పడాలని ప్రయత్నం... ఒరిగిన మృత్యు శకటంలో గాయాలైన శరీరాలతో రోదనలు...రక్షించాలంటూ విద్యార్ధుల ఆర్త నాదాలు... ఇదీ ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం ఆలవలపాడు వద్ద పాలేరు  వంతెన వద్ద ప్రమాదానికి గురైన బస్సులో పరిస్థితి. కృష్ణాజిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని మర్చిపోక ముందే పీసీ పల్లి వద్ద విహార యాత్రకు వెళ్లి వస్తున్న ప్రైవేటు బస్సు కల్వర్టును ఢీకొని అదుపు తప్పి వాగులో పడిన సంఘటనలో 40 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయ పడ్డారు. 


  సూర్యప్రతినిధి, ఒంగోలు/ కనిగిరి, మేజర్‌న్యూస్‌ : కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు బస్సు ప్రమాద ఘటనలో నెత్తుటి చారలు ఆరకముందే ప్రకాశం జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది.  విహారయాత్రలో విద్యార్థులు ఆనందంగా రెండు రోజులు గడిపి తిరిగి సొంత…  ఊరుకు పయనమైన తరుణంలో డ్రైవర్‌ మద్యం సేవించి మితిమీరిన వేగంతో  పాలేరు  వంతెన పై నుంచి ట్రావెల్‌‌స బస్సు నదిలో పడింది. ఈ సంఘటనలో 40 మందికి పైగా విద్యార్ధులు తీవ్రంగా గాయ పడ్డారు.    సింగరాయకొండ మండలం కరేడు గ్రామానికి చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 74 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు కలసి ఫిబ్రవరి 28 తేదీన మహానంది, యాగంటి, బెలున్‌ గృహాల విహార యాత్రలకు ప్రైవేటు బస్సులో బయలుదేరి వెళ్లారు. ఆ ప్రాంతాల్లో రెండు రోజు లు పర్యటించి విహారయాత్రను ముగించుకొని బుధవారం రాత్రి మహానంది నుండి కరేడుకు బయలు దేరారు.  గురువారం తెల్లవారు ఝామున 2.30 గంటల సమయంలో బస్సు కనిగిరికి వచ్చిన తర్వాత డ్రైవర్‌ మద్యం సేవించి బస్సును మితిమీరిన వేగంతో నడుపుతూ సుమారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో  పీసీపల్లి మండలం పెదఅలవలపాడు వద్దనున్న పాలేరు బ్రిడ్జి సైడ్‌ బర్‌‌మ్స ను ఢీకొనడంతో 74 మంది విద్యార్థులతో ఉన్న బస్సు దాదాపు 40 అడుగుల లోయలోకి మూడు పల్టీలు కొట్టి దూసుకపోయింది.దీంతో బస్సులో గాఢ నిద్రలో ఉన్న విద్యార్థులు కేకలు వేస్తూ... అర్థనాదాలు పెట్టారు.  బస్సులో చెల్లాచెదురుగా పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థుల ఆర్దనాదాలు విన్న స్థానికులు సంఘటనాస్థలానికి చేరుకొని సహా యక చర్యలు చేపట్టారు. సమాచారాన్ని అందుకున్న 108 సిబ్బంది హుటా హుటీన సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన విద్యార్ధులకు ప్రాథ మిక చికిత్స అందించి కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంలో 40 మందికి పైగా గాయ పడగా, వారిలో 25 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు రిమ్‌‌స కు తరలించారు. మరో విద్యార్థి పరిస్థితి సీరియస్‌గా ఉండ టంతో సంఘమిత్ర హాస్పిటల్‌లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.  


హుటాహుటీనా సంఘటనా స్థలానికి మంత్రి శిద్ధా


 జిల్లాలోని పీసీ పిల్లా మండలం అలవలపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాద విషయాన్ని తెలుసుకొని విజయవాడలో ఉన్న రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు హుటాహుటీనా  బయలుదేరి సంఘటనా స్థలానికి చేరుకు న్నారు. బస్సు ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారు అనే విషయం పై ఆరా తీశారు. అనంతరం ఒంగోలు రిమ్‌‌స, ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విద్యార్ధులను మంత్రి శిద్ధా పరామర్శించారు. గాయ పడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. వైద్యం అందించడంలో ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని డాక్టర్లకు మంత్రి సూచించారు. కృష్ణా జిల్లాలో ప్రైవేటు ట్రావెల్‌‌స బస్సు ప్రమాదం జరిగిన సంఘటన మర్చిపోక ముందే సొంత జిల్లాలో విద్యార్ధుల బస్సు బోల్తా పడటం బాధాకరంగా ఉందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదాల పై విచారణకు ఆదేశించారు. బాధ్యుల పై తగిన చర్యలు తీసుకంటామని ఆయన చెప్పారు.


 రహదారి ప్రమాదాల పై విచారణకు ఆదేశం : సీఎం


 రాష్ట్రంలో వరుస రహదారి ప్రమాదాల పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు విచారణకు ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గురు వారం తెల్లవారు జామున జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 40 మందికి పైగా గాయ పడిన విషయం తెలుసుకున్న సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మంత్రులు శిద్ధా రాఘవరావు, చిన రాజప్పను సీఎం కోరారు. 


క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్‌ 


గురువారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో గాయ పడిన కరేడు ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్ధులను జిల్లా కలెక్టర్‌ సుజాత శర్మ రిమ్‌‌స హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న 27 మంది విద్యార్ధులను పరామర్శించారు. మహానంది విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా విద్యార్ధులు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైందని కలెక్టర్‌ చెప్పారు. గాయ పడిన 27 మంది విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం రిమ్‌‌సకు తీసుకురావడం జరిగింద న్నారు. రిమ్‌‌సలో చికిత్స పొందుతున్న 27 మంది విద్యారుధలలో నలుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయని, అన్ని రకాల వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందని, శ్రీకాంత్‌ అనే విద్యార్థికి బలమైన గాయాల కారణంగా స్థానిక సంఘమిత్ర హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ సర్జరీ జరిగిందని, ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం తరుపున అన్ని విదాల వైద్య చికిత్సలు గాయ పడిన విద్యార్ధులకు డాక్టర్లు అందిస్తున్నారన్నారు. 


  పీసీపల్లి మండలం పెద్ద అలవలపాడు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై ఒంగోలు ఎంపి వై.వి. సుబ్బారెడ్డి విచారం వ్యక్తం చేశారు.  ఎస్‌.వి.ఎల్‌.టి. ట్రావెల్‌‌స పై సమగ్రƒ  దర్యాప్తు జరపాలని, బాధ్యులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకో వాలని సూచించారు. గాయపడిన విద్యార్ధులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.  


 ఒంగోలులో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన కదిరి 


 అలవలపాడు ఘటనలో తీవ్రగాయాలపాలై ఒంగోలులో  రిమ్‌‌సలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారిణి యాస్మిన్‌ కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో బ్రె యిన్‌ వద్ద దెబ్బతిని రక్తం బ్లీడింగ్‌ అవుతున్న విద్యార్థి ని ఒంగోలు సంగమిత్ర ఆసుపత్రిలో చేర్చి ఆపరేషన్‌ చేసినట్లు ఆయన వివరించారు. మరోక విద్యార్థినికి కూడా పరిస్థితి విషమిస్తుండడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల వైద్యానికి అయ్యేఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో ఏఎంసీ చైర్మన్‌ దారపనేని చంద్రశేఖర్‌, రాష్ట్ర దేశం పార్టీ కార్యదర్శి గూడూరి ఎరీక్షన్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 


 విద్యార్థులను పరామర్శించిన నాయకులు 


 అలవలపాడు ఘటనలో గాయపడి ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీమంత్రి ముక్కు కాశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, వైఎస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూధన్‌ యాదవ్‌లు , టీడీపీ నాయకులు కదిరి ప్రకాష్‌రావు, శా్యమల కాశిరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్‌ చినమస్తాన్‌లు విడివిడిగా కలసి విద్యార్థులకు అందుతున్న చికిత్సను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ప్రైవేటు ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేయాలని  డిమాండ్‌ చేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa