ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతుకుదెరువు కోసం బయటి దేశానికి వెళ్ళిన వ్యక్తి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 12:36 AM

స్వదేశానికి శవాన్ని తెప్పించాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు


   పరిగి, మేజర్‌న్యూస్‌ : ఉన్న ఊర్లో ఉపాధిలేక కుటుంబాన్ని పోషించు కుందా మన్న ఆలోచనతో అప్పులు చేసి బయటి దేశానికి బతుకుదెరువు కోసం వెళ్ళిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సౌది అరెబియాలో మూడు రోజుల క్రితం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్‌ తండాకు చెందిన ఒడిత శ్రీనివాస్‌(28) గత మూడున్నర సంవత్సరాల క్రితం సౌదిలోని రియాద్‌లో పనిచేయడానికి వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ గత వారం రోజుల క్రితం  డ్రైవింగ్‌ చేస్తూ యాక్సిడెంట్‌ చేశాడు. దీంతో అక్కడి పోలీసులు కోర్టులో హాజరుపర్చగా శ్రీనివాస్‌కు 10 రోజుల జైలు శిక్ష, 3 వేల రూపాయల జరిమాన


(ఇక్కడి రూపాయలు) విధించింది. శిక్ష అనుభవిస్తూ మూడు రోజుల క్రితం బాత్‌రూమ్‌లోకి వెళ్ళి శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. దీంతో అక్కడి పోలీసులు శ్రీనివాస్‌ తల్లిదండ్రులైన మణిబాయి, గోవింద్‌నాయక్‌లకు సమా చారం చేరవేశారు. 


ఇబ్రహీంపూర్‌తాండలో విషాదం 


బతుకుదెరువు కోసం ఉన్న ఊరు., కన్న తల్లిదండ్రులను వదిలి సౌది వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాస్‌ స్వగ్రామమైన ఇబ్రహీంపూర్‌తాండలో గురువారం  విషాధ ఛాయలు అలముకున్నాయి. సౌదిలో శ్రీనివాస్‌ ఆత్మహత్య కు పాల్పడిన విషయాన్ని అక్కడి పోలీసులతో పాటు శ్రీనివాస్‌ బంధువులు మృతుని తల్లిదండ్రులైన మణిబాయి, గోవింద్‌నాయక్‌లకు సమా చారం చేరవేయడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కడసారి చూపుకు నోచుకుంటామో లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి శవాన్ని స్వగ్రామానికి తీసుకవచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.  










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa