ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కెసిఆర్‌ ఆశయ సాధన కోసం సైనికుల్లా పనిచేస్తున్నాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 12:38 AM

మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః సుదీర్ఘ పోరాటాల అనంతరం తెలంగాణ రాషా్టన్న్రి సాదించుకున్నామని నలుగురిలో నవ్వుల పాలు కాకుండా రాషా్టన్న్రి అభివృద్ది చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గ కేంద్రంలోను ఎమ్మెల్యేలకు క్యాంపు ఫీసులు ఉండాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు. అందులో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బయికి పైగా నియోజకవర్గ కేంద్రాలలో భవనాల నిర్మాణాల ప్రక్రియ ఆరంభమయిందన్నారు. పార్లమెంటు సభ్యులకు కూడ క్యాంపు ఆఫీసులను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టుబట్టి పరకాలలో త్వరగా క్యాంపు కార్యాలయాన్ని పూర్తి చేయించారని కొనియాడారు. స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యేను కలవడానికి ప్రజలు గెస్‌‌ట హౌజ్‌ల చుట్టూ తిరిగే వారిని ఇపుడు అలాంటి అవసరం లేకుండా పోయిందని సిఎం కెసిఆర్‌ ముందుచూపుతో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలను నిర్మించి ఇస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇవి ఉపయోగపడుతాయన్నారు. త్వరలోనే భూపాలపల్లిలోను క్యాంపు కార్యాలయ నిర్మాణం పూర్తవుతుతందని అన్నారు. డిప్యూటి సిఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో గొఱ్రెలు మేకల కార్పోరేషన్‌ ఛైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, నాగుర్ల వెంకటేశ్వర్లు, ముద్దసాని సహోదర్‌రెడ్డి పసునూరి దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa