ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాదయా్త్ర ఎఫెక్‌‌ట..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 12:41 AM

సూర్యాపేటప్రతినిధి/రూరల్‌, మేజర్‌ న్యూస్‌: సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర వలనే రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులకు కొద్దిమేర జీతా లు పెంచేందుకు కంకనం కట్టుకు న్నారని.. అందులో భాగంగానే వీఆర్‌ ఏలు, అంగన్‌వాడీ, ఐకేపీ సిబ్బందికి వేతనాలు పెంచడం జరిగిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి రాయినిగూడెం, టేకుమట్ల మీదుగా నకిరేకల్‌కు వెళ్లడం జరిగింది. అయితే మార్గమధ్యలోని టేకుమట్ల గ్రామంలో బహిరంగ సభను నిర్వహించారు. ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ప్రతి గ్రామంలో కూడా పాదయాత్రకు ప్రజలు మంగళాహారతులు పట్టారు. బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పిట్టల దొర పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అసాధ్యమైన హామీలు ఇస్తూ.. పేద ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదన్నారు. కుల సంఘాల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ మోసం చేస్తున్నారన్నారు. రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వం అంటే కేసీఆర్‌ప్రభుత్వమే అని చెప్పారు. రైతులకు మోసం చేసిన ప్రభుత్వాలు నిలబడ్డ దాఖలాలు లేవని గుర్తుచేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలన రాజ్యమేలుతుందని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. కేవలం ఆ నలుగురు కుటుంబీకులకే ఉద్యోగాలు తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి పార్టీ ఎప్పుడు కృషి చేస్తూ ప్రజల మధ్యనే ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మేల్యే జులకంటి రంగారెడ్డి, ములకలపల్లి రాములు, శేఖర్‌, పల్లెల పౌలు,  నెమ్మాది వెంకటేశ్వర్లు, జాన్‌ వెస్లీ, ఎంవీ రమణ, అబ్బాస్‌, ఆసయ్య, శోభన్‌నాయక్‌, రాజు, నగేష్‌, స్వామి, సోందు, జానయ్య తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa