ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఏడాది కొత్తగా 2.8 లక్షల కేంద్ర ఉద్యోగాలు కసరత్తు ప్రారంభించిన మోడీ సర్కారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 12:58 AM

న్యూఢిల్లీ: ఈ ఏడాది పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా దేశంలో కొత్తగా 2.8 లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇన్కమ్‌ ట్యాక్‌‌స, కస్టమ్‌‌స అండ్‌ ఎకై్సజ్‌ డిపార్టె్మంట్లలో ఈ ఉద్యోగాలు అధికంగా ఉండనున్నట్లు సమాచారం. నల్లధన నిర్మూలనలో భాగంగా ఐటీ శాఖపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దౄఎష్టి పెట్టింది. ప్రస్తుతం ఆదాయపన్ను శాఖలో 46 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఆ సంఖ్య 80 వేలకు చేరనుంది.


కేంద్ర ప్రభుత్వం గతేడాది జీఎస్టీ సవరణ బిల్లు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్న కస్టమ్‌‌స అండ్‌ ఎకై్సజ్‌ డిపార్టె్మంట్కు కొత్తగా 41 వేల ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఆ శాఖలో 50,600 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఏడాది ఆ సంఖ్య 91,700కు పెరగనుంది. అయితే, రైల్వే శాఖలో మాత్రం ఎటువంటి కొత్త ఉద్యోగాలు ఉండబోవని కేంద్ర సర్కారు స్పష్టం చేసింది. ఇక విదేశాంగ శాఖలో కొత్తగా 2 వేల కొలువులను సృష్టించనున్నారు. సమాచార శాఖలోనూ కొత్తగా రెండు వేలకుపైగా ఉద్యోగాలు రానుండగా, కేబినెట్‌ సెక్రటేరియట్లో ప్రస్తుతమున్న ఉద్యోగుల సంఖ్య 921 నుంచి వచ్చే ఏడాది 1218కు పెంచాలని కేంద్ర సర్కారు కసరత్తు చేస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa