గొర్రెల పెంపకానికి సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
అత్యల్ప సంఖ్య కులాలవారికి రాజకీయ
రిజర్వేషన్లు కల్పించాలి
తెలంగాణ ఆరె కటిక పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్‌కార్ ఈశ్వర్ చౌదరి
హైదరాబాద్, మేజర్‌న్యూస్: తెలంగాణ ఉద్యమంలో జెండాలు మోసి, కీలక భూమిక పోషించినా తమను పట్టించుకునే నాథుడే లేడని తెలంగాణ ఆరెకటిక పోరాట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్యాణ్‌కార్ ఈశ్వర్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అనేక రాషా్టల్రల్లో ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నా ..తెలంగాణలో బీసీ జాబితాలో కొనసాగడం బాధాకరమన్నారు. ఎస్సీ జాబితాలో చేర్చాలని అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యలు పరిష్కరించబడతాయని తాము కన్న కలలు కలలుగానే మిగిలిపోత్నుయని ఆవేదన చెందారు. తెలంగాణలోని 56శాతం బీసీలలో 4శాతం జనాభా ఉన్న ఆరెకటికల జీవితాలు అత్యంత దుర్బరంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమంలో జెండాలు మోసినా తమను గుర్తించే నాథుడే లేడన్నారు. మాంసం విక్రయాలనే వృత్తిగా చేసుకొని జీవిస్తున్న తమకు సబ్సీడీ రుణాల ద్వారా గొర్రెల పెంపకానికి ప్రత్యేకంగా రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాదాపు 15లక్షల జనాభా ఉన్న ఆరె కటికలు అన్ని రంగాలలో అణచివేయబడుతున్నారు. ముఖ్యంగా విద్యా రంగంలో తమ సామాజిక వర్గం అత్యంత దూరంగా ఉన్నామని తెలిపారు. మా వర్గానికి ఫెడరేషన్‌లు లేవు, సబ్సిడీ రుణాలూ అందని లేదన్నారు. ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేసి, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అత్యల్ప కులాల వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, జోగు రామన్న మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను కలసి తమకు న్యాయం చేయాలని కోరినట్లు ఈశ్వర్ చౌదరి తెలిపారు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలంటే కులపరమైన రిజర్వేషన్ కావాలని అందుకోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. తమ సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని కళ్యాణ్ కార్ ఈశ్వర్ చౌదరి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa