ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిలయన్‌‌స జియో యూజర్లకు నిరాశ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 01:01 AM

 ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొందలేకపోతున్న వినియోగదారులు 


 అత్యధికులకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు  సమస్య ఉందని అంగీకరించిన రిలయన్‌‌స  త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి  ఉచిత కాల్‌‌స అపరిమితం  స్పష్టం చేసిన రిలయన్‌‌స జియో


న్యూఢిల్లీ: రిలయన్‌‌స అధినేత ముఖేష్‌ అంబాని ఇటీవల ప్రకటించిన విధంగానే జియో ప్రైమ్‌ మెంబర్షిప్‌ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. రూ.99 తో ప్రైమ్‌ మెంబర్షిప్‌ పొందితే పలు సదుపాయాలు పొందవచ్చని రిలయన్‌‌స అధినేత చేసిన ప్రకటనతో జియో యూజర్లు ఇప్పుడు ఆ పనిలోనే పడ్డారు. అందుకోసం ఆన్‌లైన్లో జియో యాప్‌ ద్వారా గానీ, జియో స్టోరుకు గానీ వెళ్లి ప్రైమ్‌ సభ్యులుగా నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.


అయితే జియో యూజర్లలో చాలామందికి నిరాశ ఎదురవుతోంది. ఆనై్లన్‌ ద్వారా ఈ సభ్యత్వం పొందాలని చూస్తోన్న వారికి కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన జియో యాజమాన్యం ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలుపుతూ.. త్వరలోనే మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. మరికొందరు జియో యూజర్లు ఆనై్లన్లో డబ్బు చెల్లించినప్పటికీ, తమకు ప్రైమ్‌ యాక్టివేట్‌ కాలేదని వాపోతున్నారు.


ఫ్రీ కాల్‌‌స అపరిమితమే: జియో ప్రైమ్‌ మెంబర్‌ షిప్‌ తీసుకున్న వారికి మొదటి 1000 నిమిషాలు మాత్రమే ఉచితమని బ్రోకరేజి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ చెప్పడాన్ని రిలయన్‌‌స జియో ఖండించింది. ఇలా పేర్కొనడం సరికాదని, తమ వినియోగదారులు, రూ. 99తో వార్షిక సభ్యత్వం స్వీకరించిన తరువాత ఎంచుకున్న నెలవారీ రీచార్‌‌జ తో పాటు అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్‌‌స అందుకోవచ్చని స్పష్టం చేసింది. రూ. 149, రూ. 303, రూ. 499 రీచార్‌‌జ లతో నెల రోజులు అన్ని కాల్‌‌స ఉచితంగా చేసుకోవచ్చని, డేటా మాత్రం మారుతుంటుందని తెలిపింది. మై జియో యాప్‌ లో అన్ని వివరాలను పొందుపరిచామని పేర్కొంది.


జీమెయిల్‌ వినియోగదారులకు వెసులుబాటు: జీ మెయిల్‌ వినియోగదారులకు వెసులుబాటు లభించింది. ఇతర మెయిల్‌‌స నుంచి వచ్చే మెయిల్‌ సైజును రెట్టింపు చేస్తున్నట్లు గూగుల్‌ సంస్థ ప్రకటించింది. ఇకపై, ఇతర మెయిల్‌‌స నుంచి 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్‌‌స ను జీ మెయిల్‌ వినియోగదారులు పొందవచ్చు. అంతకుముందు అయితే, అటాచ్‌ మెంట్లతో కలిపి జీమెయిల్‌ సైజు 25 ఎంబీ ఉండేది. 25ఎంబీ సైజు ఉన్న ఫైల్‌‌స మాత్రమే పొందేందుకు, పంపేందుకు అవకాశం ఉండేది. 


గూగుల్‌ సంస్థ తాజా నిర్ణయం ప్రకారం, 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్‌‌స ను జీ మెయిల్‌  వినియోగదారులు పొందవచ్చు. కాగా, పెద్ద సైజు ఫైల్‌‌స ను షేరు చేసుకోవాలంటే డ్రైవ్‌ అప్లికేషన్‌ ను వాడుకోవాలని, ఇది ఇప్పటికే జీ మెయిల్‌ తో కలిసి పనిచేస్తోందని పేర్కొంది. దీని నుంచి భారీ ఫైల్‌‌స ను కూడా పంపించే వీలుంది. జీమెయిల్‌ ఉన్నపళంగా సైన్‌ అవుట్‌ అవుతోందనే వినియోగదారుల ఫిర్యాదుపై గూగుల్‌ స్పందిస్తూ, ఈ విషయమై పరిశోధిస్తున్నామని, ఉన్నపళంగా సైన్‌ అవుట్‌ అవడమనేది అకౌంట్‌ సెక్యూరిటీ, ఫిషింగ్‌ దాడులకు సంబంధించిన అంశం కాదని స్పష్టం చేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa