ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్‌ఎంసీలో వేగంగా ఆన్‌లైన్‌ సేవలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 01:08 AM

 సిబ్బంది, అధికారుల అక్రమాలకు చెక్‌


 ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే ట్రేడ్‌ లైసెన్సులు జారీ


హైదరాబాద్‌, సూర్య ప్రధానప్రతినిధి: అవినీతి, అక్రమాలకు నిలయమైన హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో కొంతమేరకైనా పారదర్శకంగా పాలనను ప్రజలకు అందించేందుకు కమీషనర్‌ డాక్టర్‌ బి.జనార్థన్‌ రెడ్డి చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. గతంలో ఖాయా.. పియా..చెక్‌గయా అన్న జీహెచ్‌ఎంసీకి ఉన్న అపవాదును సాధ్యమైనంత మేరకు అపవాదునుంచి బయటపడి ప్రజలకు మెరుగైన సేవలు అందించగలదన్న నమ్మకాన్ని కలిగించేందుకు కమీషనర్‌ జనార్థన్‌రెడ్డి గత ఏడాది కాలంగా ఒక్కొక్క అడుగు ముందుకువేసుకంటూ వెళ్తు న్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా రవాణాశాఖలో ఉన్న అవినీతి, అక్రమాలను దాదాపుగా 50శాతం వరకు కళ్లెంవేశారు. వీటితో పాటు పారిశుద్ధ్య విభాగంలో కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారులు ఆక్రమసంపాద నకు గండికొట్టారు. ఇక టౌన్‌ ప్లానింగ్‌లో వేళ్లూసుకు పోయిన అవినీతిపై కూడా జనార్థన్‌రెడ్డి ప్రత్యేక దృష్టిపారిం చారు. పారదర్శకంగా ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తుల స్వీకరణ, అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టారు. నగరంలో వ్యాపారాల నిర్వహణకు సంబం దించి లైసెన్‌‌సల జారీలో భారీ ఎత్తున అవినీతి, ఆక్రమాలు జరుగుతున్నాయని, అధికారులు, సిబ్బంది చేతివాటకానికి భయపడి లైసెన్‌‌సలు తీసుకునేందుకు వ్యాపారులు ముందుకురావడంలేదన్న దానిపై దృష్టిపెట్టారు. ట్రేడ్‌లైసెన్‌‌స ఫీజు వందల్లో ఉంటే సహాయ వైద్యాధికారులు, వాళ్ల సిబ్బందికి వేలల్లో లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. ఫీజుకు భయపడని వ్యాపారులు లైసెన్‌‌స ఇచ్చేందుకు వైద్యాధికారులతో పాటు సిబ్బందికి లంచాల 


రూపంలో అధికంగా ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో లైసెన్‌‌సలు తీసుకోకుండానే వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో బల్ధియా ఖజానాకు భారీ ఎత్తున గండిపడుతున్న విషయాన్ని గ్రహించిన కమీషనర్‌ జనార్థన్‌రెడ్డి దీనికి కూడా సాధ్యమైనంత మేరకు ఫుల్‌స్టాఫ్‌పెట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఇకపై ట్రేడ్‌ లైసెన్‌‌సలు కూడా ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పారదర్శకంగా లైసెన్‌‌సలు జారీ చేసే విధానం అందుబాటులోకి రావడంతో ప్రతీ వ్యాపారి సునాయసంగా లైసెన్‌‌సతీసుకునేందుకు ముందుకువచ్చే అవకాశం ఉంది. గతంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షల దుకాణాలుంటే వేలల్లో మాత్రమే ట్రేడ్‌లైసెన్‌‌సలు జారీ అయిన విషయం విధితమే!. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa