ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌స పెంచాలని వినతి అంగన్ వాడీ కార్యకర్తలకు
సైతం వేతనాలు పెంచడం అభినం దనీయ
యూనివర్శిటీ విద్యార్థుల మెస్ చార్జీలను
నెలకు రూ. 684 నుంచి రూ. 2400 లకు
పెంచాలి : బీసీ నేత, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి జోగు రామన్నకు బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. మొన్న విఆర్‌ఎ, నిన్న విఓఎలతో పాటు అంగన్ వాడీ కార్యకర్తలకు సైతం వేతనాలు పెంచడం అభినందనీయమని, అదే సమయంలో పెరిగిన ధరలకను గుణంగా విద్యార్థుల స్కాలర్ షిప్‌స, మెస్ చార్జీలు పెంచాల్సి న అవసరం ఉందని తెలిపారు. గురువారం సచివాల యంలో బీసీ నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాల నేతలు డాక్టర్ ర్యాగ అరుణ్, గుజ్జ కృష్ణ, గొరిగె మల్లేష్ యాదవ్, నీల వెంకటేశ్, వి.రామకృష్ణ, శ్రీని వాస్, భార్గవ్, జి.కృష్ణ యాదవ్‌లతో కలిసి మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లా డుతూ లక్షలాది మంది ఉద్యోగులు అడిగిన దానికి ఎక్కువ వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి అదే పెద్ద మనసుతో పేద విద్యార్థుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయా లని మంత్రి జోగు రామన్నకు విన్నవించారు.
2011లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాం లో పెంచిన స్కాలర్‌షిప్‌స, మెస్ చార్జీలు ఇస్తున్నారని, ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు అయినం దున కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1050 నుంచి రూ.2వేలకు పెంచాలన్నారు. యూనివర్శిటీ విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.684నుంచి రూ.2400లకు పెంచాలన్నారు. పాఠశాల హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల మెస్ చార్జీలను నెలకు రూ.750నుంచి రూ.1500లకు పెంచాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యా ర్థుల సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి జోగు రామన్నకు కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa