మహాజన పాదయా్త్ర సభలో తమ్మినేని
నల్గొండ జిల్లాలో ప్రవేశం
టీడబ్లూ్యజెఎఫ్ సంఘీభావం
సామాజిక తెలంగాణ కోసం ఆయన
చేపట్టిన పాదయా్త్ర
హైదరాబాద్, సూర్యప్రతినిధి: పోరాటాల ఫలితంగా సాధించు కున్న తెలంగాణలో పేదవాడు.. పేదవాడిగానే.. సంపన్నుడు.. మరింత సంపన్నుడుగా మారుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక తెలం గాణ నిర్మాణానికి, పేదోడికి అండ..దండలు అం దించేందుకు ఐక్య ఉద్యమాలే శరణ్యమన్నారు. సామాజిక తెలంగాణ కోసం ఆయన చేపట్టిన పాదయాత్ర గురువారంనాడు సూర్యాపేట జిల్లా నుంచి నల్గొండ జిల్లాలో ప్రవేశించింది. సూర్య పేట జిల్లాలో కొనసాగుతున్న వీరభద్రం పాదయాత్రకు తెలంగాణ వర్కింగ్ జర్నటిస్టుల ఫెడరేషన్(టీడబ్లూ్యజెఎఫ్) నేతలు పి.ఆనం దం, బి.బసవపున్నయ్య, చంద్రశేఖర్, పద్మరాజులు సంఘీభావం పలికారు. ఆయనతో కొన్ని గంటలపాటు పాదయాత్రలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ . తెలంగాణ ముఖచిత్రం మార్చాలంటే రాజకీయాలకతీతంగా సామాజిక న్యాయం కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది అని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు రోజుకో తీరుగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నెల 19న హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభకు గద్దర్, విమలక్క, కోదండరాం, సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం సేవ చేస్తున్న మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంను తమ్మినేని కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాశారు. మున్సిపల్ కార్మికులకు 3,4 నెల లకోసారి కాకుండా ప్రతినెలా వేతనాలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa