ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్టవ్య్రాప్తంగా వైసీపీ నిరసనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 01:43 AM

 రోడ్డెక్కిన  పార్టీ నేతలు  టిడిపి సర్కార్‌పై ఎదురుదాడికి వైసీపీ నిర్ణయం  


బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులపై మండిపడ్డ ఘటనలను ప్రస్తావించాలన్న నిర్ణయం  


బస్సు ప్రమాద ఘట్టాన్ని సర్కార్‌కు వ్యతిరేకంగా నిలిపేలా వ్యూహం


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : దివాకర ట్రావెల్‌‌స బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన, క్షతగాత్ర బాధితుల పరామర్శకు వెళ్లిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినే వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్టవ్య్రాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. తప్పులను ప్రశ్నిస్తే మా నేతపైనే కేసులు పెడతారా అంటూ ధర్నాలు, ఆందోళనలు, నిరసనలకు వైసీపీ నేతలు దిగారు. గురువారంనాడు రాష్టవ్య్రాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. విజయవాడ కలెక్టర్‌పై వై.ఎస్‌.జగన్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ నిన్ను జైలుకు పంపిస్తానని, అసభ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయనపై కేసు నమోదు చేశారు. డాక్టర్లను సైతం అడ్డుకొన్నారని జగన్‌పై కేసులు నమోదు చేశారు. ఈ కేసుల వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టిన వైసీపీ ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విశాఖజిల్లా అనకాపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నేతలు జానకి రామరాజు, గొర్లె సూరిబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. అదేవిధంగా కశింకోట తహశీల్దార్‌ ఆఫీస్‌ ఎదుట గొల్లవెల్లి నివాసరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 


కృష్ణా జిల్లాలో నందిగామలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేప్టటారు. ఈ సందర్భంగా స్ధానిక వైసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్‌ కుమార్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద వైసీపీ నేతలు చేస్తున్న దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. 144 సెక్షన్‌ అమలులో ఉందంటూ ధర్నాను అడ్డుకున్నారు. పార్టీ నేతలు గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొల్లా విజయ్‌కుమార్‌లను అరెస్టుచేసి నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు.


గుంటూరుజిల్లా సత్తెనపల్లి ఎమ్మార్వో ఆఫీసు వద్ద అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తాడికొండలో సురేష్‌ ఆధ్వర్యంలో, రేపల్లేలో మాజీ మంత్రి మోపిదేవి నేతృత్వంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. కడపజిల్లా పులివెందుల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట వై.ఎస్‌. వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, వినతిపత్రం అందజేశారు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. నగరంలోని భవానీనగర్‌ సర్కిల్‌లో వైసీపీ నేతలు బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సందర్బంగా వైసీపీ నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, రోజా మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.


బాబు వీరంగంపైనా ప్రచారానికి వైసీపీ సన్నాహాలు : తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వివిధ కార్యక్రమాలు చంద్రబాబునాయుడు అధికార్లపై ఆగ్రహం చేసిన ఘటనలు ఉన్నాయని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. నాడు చంద్రబాబు అధికార్లపై ఆగ్రహం వ్యక్తంచేస్తే తప్పులేదు గానీ ప్రమాద బాధితుల కోసం జగన్‌ అధికార్లను నిలదీస్తే తప్పేంటన్న దిశగా వైసీపీ నేతలు ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నాడు బాబు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వివిధ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో ఆయన అధికార్లపై చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలను  వైసీసీ నేతలు తవ్వితీసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికీ వైసీపీ అనుబంధ పత్రిక ద్వారా బాబు అధికార్లపై మండిపడుతున్న వ్యవహారాన్ని ప్రచారం చేసేందుకు శ్రీకారం చుట్టిన వైసీసీ నేతలు మున్ముందు ఈ విషయంలో జనంలోకి కూడా వెళ్లాలని యోచిస్తున్నారు. దివాకర ట్రావెల్‌‌స బస్సు ఘోర ప్రమాదానికి గురికావడం ప్రయాణికులు మరణించడం నేపథ్యంలో ఈ ఘటనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మల్చాలని వైసీపీ సమాలోచనలు చేస్తోంది. దివాకర ట్రావెల్‌‌స యాజమాన్యం టిడిపిలోని ఎంపీ జే.సి.దివాకర్‌రెడ్డి, జే.సీ.ప్రభాకర్‌రెడ్డిలు కావడంతో ఈ అంశం మరింత రాజకీయ రంగు పులుముకొంటోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa