వ్యక్తిగత విమర్శలకు దిగిన అధికార పార్టీ నేతలు
అయినా స్పందించని కాంగ్రెస్ అగ్రనేతలు
మహిళానేతలది కూడా అదేతీరు గతంలోను అదే వరుస
హైదరాబాద్, మేజర్‌న్యూస్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకు రాలు డీ.కే అరుణ పార్టీ అగ్రనేతలతీరుపై అసంతృప్తితో రగిలిపోతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అదేపనిగా తనని, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నా, పార్టీ ముఖ్య నేతలెవరూ స్పందించకపోవడం పట్ల డీకే అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్‌పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ కోసమే తాను అధికారపార్టీ తీరుపై విరుచుకుపడుతున్నా, పార్టీ అగ్రనేత లుకానీ, మహిళా కాంగ్రెస్ నేతలు తనకు దన్నుగా నిలవకపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారంటున్నారు. అధికారపార్టీతీరుపై మొదటి నుంచి డీకే అరుణ ఒంటికాలిపై ఫైరవుతున్నారు. ముఖ్యంగా జోగులాంబ-గద్వాల జిల్లా ఏర్పాటు కోసం ఆమె ఉద్యమించి అనుకున్నది సాధించారు. జోగులాంబ, గద్వాల జిల్లా కోసం అరుణ ఉద్యమించిననాటి నుంచి అధికారపార్టీ నేతలు ఆమెపై తరుచూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను దొంగల ముఠాతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ముఖ్యమంత్రివి కాదు కదా చఫ్రాసీకూడా అయి ఉండేవాడివి కాదని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. అరుణ విమర్శలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్‌ఎస్ ఉమ్మడి పాలమూ రు జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గువ్వల బాలరాజు, వెంకటేశ్వ ర్‌రెడ్డి ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నంలో వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అయితే మంత్రి, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనపై, తన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకు దిగితే, పార్టీ అగ్రనేతలేవరు స్పందించకపోవడం పట్ల అరుణ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.తాను పార్టీ కోసం అధికార పార్టీపై పోరాడు తుంటే, తనపై టీఆర్‌ఎస్ నేతలు చేసిన విమర్శలను పార్టీ ముఖ్యనేతలు ఎందుకు ఖండించడం లేదని డీఆమె సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ అగ్రనేతలే కాకుండా గతంలో తనతో పాటు కేబినెట్‌లో సహచర మంత్రులుగా పనిచేసిన మహిళా నేతలెవరూ స్పందించకపోవడం పట్ల డీకే అరుణ అసంతృప్తితో ఉన్నారని ఆమె సన్నిహి తులు చెబుతున్నారు. అరుణపై అధికారపార్టీ నేతలు చేసిన విమర్శలను మహిళా కాంగ్రెస్ నాయకత్వం కూడా తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమ యిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక మహిళానాయకురాలు, మాజీ మంత్రిపై మంత్రి, అధికారపార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత విమర్శలు చేస్తే, మహిళా కాంగ్రెస్ నాయకత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌పార్టీ వర్గాలే అంటున్నాయి. పార్టీ సీనియర్‌నాయకురాలు, మాజీమంత్రిపై అధికార పార్టీ నాయకులు వ్యక్తగత విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే, ఎదురుదాడికి ఎందుకు దిగడం లేదనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa