ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్లో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మెల్ బోర్న్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో కన్నుల పండువగా సంబురాలు నిర్వహించారు. మెల్ బోర్న్ లోని తెలంగాణ ఆడబిడ్డలంతా ఒక్క చోట చేరి.. ఉయ్యాల పాటలతో హోరెత్తించారు. గెల్లీబ్రాండ్ ఎంపీ టిమ్ వాట్స్‌తో పాటు స్థానిక మేయర్ కేథరిన్, డిప్యూటీ మేయర్ సారా కార్టర్ బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు.