హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆరు వేల మంది మహిళలు పసుపుపచ్చ, ఆకుపచ్చ చీరలు ధరించి తంగేడు పూవు ఆకారంలో నిలిచారు. వీరిలో మూడు వేల మంది పువ్వు ఆకారంలో, మరో మూడు వేల మంది ఆకుల ఆకారంలో నిలిచారు. ఆ తర్వాత భారీ బతుకమ్మ చుట్టూ ఒకేసారి మూడు వేల బతుకమ్మలను పేర్చి, బతుకమ్మ ఆడుతున్నారు. కాసేపట్లో ఎల్బీ స్టేడియం నుంచి బతుకమ్మ శోభాయాత్ర ట్యాంక్ బండ్ మీదికి చేరుకుంటుంది. అక్కడ బతుకమ్మ ఆడి బతుకమ్మ ఘాట్ లో సాగనంపుతారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.