ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ పాలనలో రైతులకు తప్పిన కరెంట్ కష్టాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 12:12 PM

టీఆర్‌ఎస్‌ సర్కారు ముందు చూపుతో అన్నదాతలు లబ్ది పొందుతున్నారు. రైతుపక్షపాతి ప్రభుత్వం అండతో లాభాలు మూటగట్టుకుంటున్నారు.  ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాలోని  రైతుల కష్టాలన్నీ కడతేరుతున్నాయి. సమైక్య పాలనలో నానా తిప్పలుపడ్డ అన్నదాతలు ఇప్పుడు లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా కరెంట్‌ కటకటనుంచి రైతులు గట్టెక్కారు. సాగుకు సరిపడా కరెంట్‌ ఇస్తుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్‌ కోసం  వ్యవసాయ బోరుబావుల వద్ద  పడిగాపులు కాసే పరిస్థితులకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరంతర విద్యుత్ అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్‌లు నిర్మించి విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లా లోని నందిపేట్ మండలం వన్నెల్  కె గ్రామ శివారులో సుమారు 84 ఎకరాల్లో 120 కోట్లతో  వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది. రోజుకు 20 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే విధంగా గుజరాత్ రాష్ర్టానికి చెందిన ఊజ్వల తేజ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈనెల చివరికల్లా పనులు పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే పలు గ్రామాలకు లైన్లు కూడా వేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa