ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయాలకు పెరుగుతున్న ఆదాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 12:19 PM

రాష్ట్రంలోని ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతున్నది. భక్తులు భక్తిపారవశ్యంలో పులకించిపోతున్నారు. ప్రభుత్వం ప్రతి ఆలయానికీ విశిష్టతను కలిగించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుండటంతో పుణ్యక్షేత్రాలు నిత్య సందడిని సంతరించుకుంటున్నాయి. దీంతో ఆలయాలకు ఆదాయం కూడా భారీగానే వస్తున్నది.భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి 2014-15లో 21కోట్ల 60లక్షల ఆదాయం లభించగా, 2015-16లో 22 కోట్ల 43లక్షలు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 24కోట్లు దాటుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఇక  బాసర శ్రీ సరస్వతీ క్షేత్రానికి 2014-15లో  12కోట్ల 72లక్షలు రాగా, 2015-16 లో 15కోట్లకు పెరిగింది. కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి 2014-15లో 7కోట్ల 63లక్షలు, 2015-16లో 8కోట్ల 71లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం 9కోట్లు దాటుతుందని అధికారులంటున్నారు. గుట్టపైన ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామికి ఆదాయ వనరులు బాగా పెరుగుతున్నాయి. 2014-15లో  9కోట్ల 25 లక్షలు లభించగా, 2015-16లో 12కోట్ల 94లక్షలు వచ్చాయి. 2016 -17లో 14కోట్లు వస్తుందని ఆలయ అధికారుల అంటున్నారు. యాదాద్రి దేవస్థానానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో 73 కోట్ల 3లక్షల 16వేల రూపాయల ఆదాయం రాగా 2015-16లో 77కోట్ల 80లక్షల 77వేలు సమకూరింది. ఈ ఏడాది మాత్రం 80కోట్లకు పైగా ఆదాయం ఉండొచ్చని భావిస్తున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందున భక్తుల సంఖ్య రెట్టింపవనుంది. ఇక రాష్ట్రానికి తలమానికమైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి 2016-17లో 110కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 2014-15లో  3కోట్ల 70లక్షలు రాగా, 2015-16లో 4కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది నాలుగున్నర కోట్లు లభిస్తాయని అంచనాలున్నాయి. ఇక దక్షిణకాశిగా పేరున్న కాళేశ్వర ముక్తేశ్వరస్వామి క్షేత్రం రాజరాజేశ్వరస్వామికి 2015-16లో 4కోట్ల 50లక్షల ఆదాయం వచ్చింది. 2016-17లో రూ.5కోట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇక మహాశివరాత్రి ఉత్సవాలు, గోదావరి పుష్కరాలు, కృష్ణాపుష్కరాల సందర్భాలలో వచ్చిన ఆదాయాలను ఈ లెక్కలలో మినహాయించారు. ఒక్క గోదావరి పుష్కరాల సందర్భంలోనే బాసర, భద్రాచలం, కాళేశ్వ రం, ధర్మపురి వంటి ఆలయాలకు కలిపి 2015 జూలైలో వంద కోట్ల వరకు ఆదాయం లభించింది. యాదాద్రి, వేములవాడ వంటి ఆలయాలకు లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారానే రూ.12కోట్ల వరకు ఆదా యం సమకూరుతున్నది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa