ఈ వేసవి కాలంలో రాష్ట్రంలో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీటి ఎద్దడి నివారణ కోసం అధికారులు పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కొత్త బోర్లను ఏర్పాటు చేయడంతో ఇప్పటికే ఉన్న బోర్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. తీవ్ర తాగునీటి ఎద్దడికి ఉండే ఆవాసాలలో ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నారు. వేసవి ముగిసేవరకు రైతుల నుంచి వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోనున్నారు. 11 వేల 172 ఆవాసాలలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు 10 వేల 414 బోర్లను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గ్రామాలలో ఉన్న తాగునీటి పథకాల పైపులైన్లు, పంపుసెట్లకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. వేసవిలో అంటువ్యాధులు ప్రబలకుండా తాగునీటిని నిల్వ చేసే సంపులు, ట్యాంకులను రిపేరు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఆర్‌ఎఫ్, నాన్-సీఆర్‌ఎఫ్ నిధులను వినియోగించనున్నారు. దాదాపు రూ.370 కోట్లతో నీటికష్టాలు తీర్చడానికి కార్యచరణ ఏర్పాటు చేసింది. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మొత్తం 11 వేల 172 అవాసాలలో నీటి ఎద్దడి తలెత్తే పరిస్థితులు ఉన్నట్లు గుర్తించారు. దాంతో అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి నీటి కష్టాలు లేకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa