ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 14, 2017, 10:57 AM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, తన వారసుడు రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటాడని శుక్రవారం సంకేతాలు ఇచ్చారు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. తనతో రాహుల్ గాంధీకి బాధ్యతల అంశాన్ని ప్రస్తావించిన న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో స్పందిస్తూ... త్వరలోనే ఆ పని కూడా పూర్తవుతుంది అని అన్నారామె. కానీ ఇదే అంశంపై రాహుల్ గాంధీని స్పందించాల్సిందిగా కోరినప్పటికీ ఆయన అందుకు నిరాకరించారు.


ఇటీవలే ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పార్టీని ముందుండి నడిపించే రోజు ఇంకెంతో దూరంలో లేదని, ఈ దీపావళి తర్వాతే అది జరిగినా జరగొచ్చని అన్నారు. రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సంబంధించిన తేదీలని ఖరారు చేసేందుకు త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సడబ్ల్యూసీ) భేటీ అయ్యే అవకాశాలున్నాయని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com