హైదరాబాద్: తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వస్తున్న కథనాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక విషయం తనకు తెలియదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. టీ టీడీపీలో కీలక నేత అయిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న కథనాలు టీడీపీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రులను టార్గెట్గా చేసుకొని రేవంత్ విమర్శలు కూడా చేశారు. ఈ క్రమంలో రేవంత్ హస్తం గూటికి చేరుతారన్న కథనాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారు.