ట్రెండింగ్
Epaper    English    தமிழ்

13న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 03, 2017, 07:21 PM

 హైదరాబాద్ : ఈ నెల 10 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 13న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. 2017-18 బడ్జెట్ సంక్షేమ ఫలాలు ప్రజలకు మరింత గొప్పగా అందేలా ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపిన విషయం విదితమే. సబ్‌ప్లాన్ నిబంధనలకు లోబడే దళిత, గిరిజన వర్గాలకు పూర్తి స్థాయి నిధులు కేటాయిస్తామన్నారు. రుణపరిమితికి లోబడే అప్పులు తెస్తున్నామని స్పష్టం చేశారు. విభజన తర్వాత తొలిసారి రూ. లక్ష కోట్ల బడ్జెట్, రెండోసారి రూ. లక్షా 30 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa