హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణను పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.పార్టీ నాయకులు హద్దులు దాటుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గాందీభవన్ లోని టిపిసిసి కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ మేరకు పాల్యాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సీనియర్లు కొందరు క్రమశిక్షణను పాటించడం లేదని ఆయన ఆరోపించారు. హద్దులు దాటుతున్నారని వారిపైస చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకుడు ఎకె ఆంటోనిని కూడ కోరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గీత దాటి వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు.కొందరు పార్టీ నాయకులు క్రమశిక్షణను దాటిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణను విస్మరిస్తున్న నాయకులను దిగ్విజయ్ సింగే కట్టడి చేయాలని ఆయన కోరారు.అయితే ఈ సమావేశానికి ఏడుగురు సభ్యులు డుమ్మా కొట్టారు. రాపోలు ఆనంద బాస్కర్, ఎంఏ ఖాన్, జైపాల్ ెడ్డి, దామోదర్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, పొడెం వీరయ్య లు సమావేశానికి గైరాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa