ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చొరవతో... ప్రగతిపథంలో నిమ్‌‌స వైద్యశాల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 12:16 AM

  -తొలిసారిగా తెలంగాణకు రెండు ఎమర్జెన్సీ  
  -పీజీ మెడికల్‌ డిపార్‌‌టమెంట్‌ సీట్లు
  -నిమ్‌‌సకి మరో 30 పీజీ సీట్లు
  -నిమ్‌‌స డైరెక్టర్‌ డాక్టర్‌ కె. మనోహర్‌
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: తెలంగాణ సీఎం చొరవ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సి.లకాష్మరెడ్డి కృషి , ప్రోత్సాహం ఫలితంగా నిమ్‌‌స ప్రగతి పథంలో నడుస్తుందని నిమ్‌‌స డైరెక్టర్‌ డాక్టర్‌ కె.మనోహర్‌ తెలిపారు. ప్రభుత్వ రంగంలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌గా రోగులకు ఎనలేని సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా సదుపాయాల కల్పనతో పాటు అధునాతన రోగ నిర్దారణ పరీక్షల యంత్రాలను సైతం సిద్దం చేశామని పేర్కొన్నారు.  దేశంలోని అత్యాధునిక వైద్యాన్ని ఇక్కడ అందించడానికి వీలుగా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల రంగంలో తొలిసారి ఎమర్జెన్సీ మెడిసిన్‌ డిపార్‌‌టమెంటికి రెండు పీజీ సీట్లను మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మంజూరు చేసింది. 2017-18 ఎడాదికి మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా నిమ్‌‌సకి లెటర్‌ ఆఫ్‌ పర్మీషన్‌ను ఇచ్చింది. వైద్య రంగంలో ప్రైవేట్‌లో ఒక మెడికల్‌ కాలేజీలో మాత్రమే ఈ సదుపాయం ఉండగా, ప్రభుత్వ రంగంలో నిమ్‌‌సకి మాత్రమే ఈ సదుపాయం కల్పించింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నిమ్‌‌స ప్రగతి పథంలో పయనిస్తోంది. నిమ్‌‌సలో బెడ్ల సంఖ్యని 1140 నుంచి 1500లకు పెంచారు. కొత్త బెడ్లు, కొత్త ఫర్నీచర్‌, ఇతర డయాగ్నసిస్‌ సదుపాయాలు పెంచడం జరిగింది. త్వరలో రెండు సూపర్‌ స్పెషాలిటీ టవర్‌‌సని నిమ్‌‌స ఏర్పాటు చేయబోతోంది. త్రి టీ ఎంఆర్‌ఐ, రెండు క్యాథల్యాబ్‌‌స, స్లీవ్‌ ల్యాబ్‌, 128 సై్లస్‌ సీటీ వంటి అధునాతన సదుపాయాలు కూడా పెరిగాయి. ఈ దశలోనే అదనంగా పీజీ సీట్లు 28 రావడం, మరో రెండు పీజీ ఎమర్జెన్సీ మెడిసిన్‌ డిపార్‌‌టమెంట్‌ సీట్లు కూడా రావడం ముదావహం కాగా, నిమ్‌‌సలో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో గతంలో 4సీట్లుండగా, ప్రస్తుతం 11 సీట్లని పెంచారు. దీంతో ఈ విభాగంలో మొత్తం సీట్ల సంఖ్య 15కు చేరింది. ఎండి అనెస్తీషియా గతంలో ఏడ సీట్లుండగా, ప్రస్తుతం 8 సీట్లను పెంచారు. దీంతో ఈ విభాగంలో మొత్తం సీట్ల సంఖ్య 15కు చేరింది. ఎండి రేడియాలజీలో గతంలో 5 సీట్లుండగా, ప్రస్తుతం 6సీట్లను పెంచారు. దీంతో ఈ విభాగంలో మొత్తం సీట్ల సంఖ్య 11కు చేరింది. ఎంఎస్‌ ఆర్థోపెడిక్‌‌సలో గతంలో ఆరు సీట్లుండగా, ప్రస్తుతం 3 సీట్లు పెంచారు. దీంతో ఈ విభాగంలో మొత్తం సీట్ల సంఖ్య 9కి పెరిగింది. ఇదిలా ఉండగా నిమ్‌‌సకు 30 పీజీ సీట్లు రావడం వల్ల రోగులకు ఎంతో ఉపయోగం కలుగుతుందని డైరెక్టర్‌ మనోహర్‌ తెలిపారు. తాజా పీజీ సీట్ల తో రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఉత్తమమైన వైద్య సేవలు అందుతాయన్నారు. డాక్టర్లకు ఈ విభాగంలో చదువుకునే అవకాశం దొరుకుతుందని, క్రమేణా ఈ విభాగం బలపడటమేగాక, ఎక్కువ మంది డాక్టర్లను ఈ విభాగం నుంచి ఉత్పత్తి చేయడానికి వీలవుతుందని తెలిపారు. ఈ సీట్లు రావడానికి తోడ్పడిన సీఎం కేసీఆర్‌, మంత్రి లకాష్మరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa